Vakeel Saab: ఓ చేతిలో పుస్తకం, మరో చేతిలో బేస్ బాల్ స్టిక్ తో పవన్ కల్యాణ్.. ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్‌ వీడియో విడుదల

  • పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల
  • గాంధీజీ ఫొటోతో ప్రారంభమవుతున్న మోషన్ పోస్టర్ వీడియో
  • నల్లకోటులో కనపడుతున్న పవన్
VakeelSaab MotionPoster release

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ‘వకీల్ సాబ్’ సినిమా నుంచి ఆ సినిమా యూనిట్‌ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. సరిగ్గా ఈ రోజు ఉదయం 9.09 గంటలకు దీన్ని విడుదల చేశారు. గాంధీజీ ఫొటోతో ప్రారంభమవుతున్న ఈ మోషన్ పోస్టర్‌లో వకీల్ పాత్రలో పవన్ కల్యాణ్ నల్లకోటు, చేతిలో న్యాయ శాస్త్ర పుస్తకం, మరో చేతిలో బేస్ బాల్ స్టిక్ పట్టుకుని కనపడుతున్నారు.  

కాగా, ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్యలు నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్‌లో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.  
     

More Telugu News