KK Singh: రియా నా బిడ్డను చంపిన హంతకురాలు... సుశాంత్ తండ్రి తీవ్ర ఆరోపణలు

Sushant father KK Singh calls Rhea Chakraborty a killer
  • చాలా రోజులుగా సుశాంత్ కు విషం ఇస్తోందన్న కేకే సింగ్
  • రియా గ్యాంగ్ ను అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి
  • సుశాంత్ మృతి వ్యవహారంలో డ్రగ్స్ కలకలం
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తండ్రి కేకే సింగ్ తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ గాళ్ ఫ్రెండ్ రియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రియా తన బిడ్డను చంపిన హంతకురాలు అని పేర్కొన్నారు. ఆమెపైనా, ఆమె అనుచరులపైనా దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవాలని కోరారు. రియా గ్యాంగ్ ను అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

 రియా చాలారోజులుగా తన కుమారుడు సుశాంత్ కు విషం ఇస్తోందని ఆరోపించారు. సుశాంత్ మృతి వ్యవహారంలో డ్రగ్స్ కోణం తెరపైకి వచ్చిన నేపథ్యంలో కేకే సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంతకుముందు రియా వ్యాఖ్యానిస్తూ, తనకు డ్రగ్స్ వ్యవహారంతో సంబంధంలేదని స్పష్టం చేశారు. తాను చేసిన తప్పల్లా సుశాంత్ ను ప్రేమించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
KK Singh
Rhea Chakraborty
Sushant Singh Rajput
Death
Bollywood

More Telugu News