నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు సుశాంత్ ను ప్రేమించడమే: రియా సంచలన వ్యాఖ్యలు!

Loving Sushant is My big Mistake says Rhea
  • సుశాంత్ ఆత్మహత్య తరువాత ఇక్కట్లు
  • నా వద్ద దాచేందుకు ఏమీ లేదు
  • సుశాంత్ తో ప్రేమే కష్టాల పాలు చేసిందన్న రియా
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత, అతని బంధువులు, అభిమానులకు నటి, రియా టార్గెట్ గా మారిందన్న సంగతి తెలిసిందే. ఆమె కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఆమె సీబీఐ విచారణనూ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ న్యూస్ పోర్టల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రియా, తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు సుశాంత్ ను ప్రేమించడమేనని సంచలన వ్యాఖ్యలు చేసింది. అదే తననిప్పుడు కష్టాల్లోకి నెట్టిందని వాపోయింది.

తనను ఏ విచారణ సంస్థ ఇంటరాగేషన్ చేసినా, దాచి పెట్టేందుకు తన వద్ద ఏమీ లేదని వ్యాఖ్యానించిన రియా, తానెప్పుడూ డ్రగ్స్ వాడలేదని వ్యాఖ్యానించింది. కాగా, రియాపై సీబీఐతో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా దృష్టిని సారించిన సంగతి తెలిసిందే. ఆమె అక్రమంగా డబ్బు తరలించిందని ఈడీ, డ్రగ్స్ వాడకం, సరఫరా ఆరోపణలపై ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) కేసులను రిజిస్టర్ చేశాయి.
Go Back to Shorts
Rhea Chakravarthi
Sushant Singh Rajput

More Telugu News