Sushant Singh Rajput: డ్రగ్స్‌ డీలర్‌తో సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా సంప్రదింపులు.. అరెస్టు చేసే అవకాశం

  • కొనసాగుతోన్న కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) విచారణ
  • డ్రగ్స్ డీలర్లతో రియా వాట్సప్‌ చాటింగ్‌
  • మిథిలీన్‌ డయాక్సీ మెథాంఫేటమిన్‌ గురించి ఆమె ఆరా
  • రియా కుటుంబ సభ్యులనూ విచారిస్తోన్న సీబీఐ
rhea spoke with drug dealer

బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) విచారణ కొనసాగుతోంది.  సుశాంత్‌ ప్రేయసి రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడిని సీబీఐ అధికారులు విచారించారు. ఆమె వాట్సప్‌ చాటింగ్‌పై కూడా అధికారులు దృష్టి పెట్టగా ఆమె  డ్రగ్స్ డీలర్లతోనూ సంప్రదింపులు జరిపేదని తేలింది.

డ్రగ్స్ డీలర్లతో ఆమె చేసిన చాటింగ్‌ సంభాషణల సమాచారాన్ని ఈడీ అధికారులు సీబీఐ అధికారులకు ఇచ్చారు. డ్రగ్‌ డీలర్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌరవ్‌ ఆర్యతో ఆమె సంప్రదింపులు జరిపింది. గౌరవ్‌తో 2017 మార్చి 8 నుంచి ఆమె సంప్రదింపులు జరుపుతోంది. అత్యంత ప్రభావితం చేసే డ్రగ్స్ మిథిలీన్‌ డయాక్సీ మెథాంఫేటమిన్‌ గురించి ఆమె ఆరా తీసింది. మరికొందరు డ్రగ్స్ డీలర్లతోనూ ఆమె సంప్రదింపులు జరిపింది.

డ్రగ్‌ డీలర్‌తో ఆమె జరిపిన సంభాషణ బయటకు వచ్చిన నేపథ్యంలో రియా చక్రవర్తిని సీబీఐ అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుశాంత్‌ నుంచి రియా చక్రవర్తి డబ్బు తీసుకుందన్న ఆరోపణలు రావడంతో ఆమె బ్యాంకు ఖాతాపై ఈడీ విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఆమె డ్రగ్స్ డీలర్లతో జరిపిన సంభాషణ గురించి ఈడీ సమాచారం సేకరించింది. ఇప్పటికే రియాతో పాటు ఆమె కుటుంబ సభ్యుల ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఈడీ స్వాధీనం చేసుకుంది.

More Telugu News