Junior NTR: 'ఆర్‌ఆర్‌ఆర్'లో ఎన్టీఆర్‌ ఫస్ట్‌లుక్‌ ఎప్పుడు విడుదలవుతుందో చెప్పేసిన రాజమౌళి!

ntr look in rrr will release after shooting begins again
షార్ట్స్‌లో చూడండి
బాహుబలి తరువాత రాజమౌళి తీస్తోన్న రౌద్రం ర‌ణం రుధిరం (ఆర్ఆర్ఆర్) సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే విడుదలైన  రామ్‌ చ‌ర‌ణ్‌కు సంబంధించిన ఈ సినిమాలోని ఫస్ట్ లుక్, ప్రోమో అందరినీ అలరించాయి. అల్లూరి సీతారామరాజుగా చెర్రీ లుక్ అదిరిపోయింది.

అయితే, ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్బంగా తారక్‌  ఫ‌స్ట్‌లుక్, టీజ‌ర్‌ వస్తాయని అందరూ భావించగా తీవ్ర నిరాశే మిగిలింది. ఈ లుక్ వాయిదా పడడంతో ఇప్పుడు అభిమానులంతా దా‌ని కోసం ఎదురు చూస్తున్నారు.

అది ఎప్పుడు విడుదలవుతుందన్న విషయంపై రాజమౌళి స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాలోని ఎన్టీఆర్‌.. కొమురం భీమ్ లుక్‌ను ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్ మళ్లీ మొద‌లైన ప‌ది రోజుల అనంతరం  విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు. కరోనా కారణంగా షూటింగులు ఆగిపోయిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
Junior NTR
Rajamouli
RRR
Tollywood

More Telugu News