Chiranjeevi: 'ఆచార్య' మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన చిరంజీవి.. వీడియో ఇదిగో!

Chiranjeevis Acharya motion poster released
షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'ఆచార్య'. చిరంజీవి కెరీర్లో ఇది 152వ చిత్రం. రామ్ చరణ్, మాట్నీ మూవీస్ నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరోవైపు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం ఆసన్నమైంది.

ఈరోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను కాసేపటి క్రితం విడుదల చేశారు. జనం కోసం పోరాడుతున్న వ్యక్తిగా చిరంజీవి కనిపిస్తున్నారు. ధర్మస్థలి అనే ఊరి ప్రజల కోసం చిరు కత్తిని చేతపట్టినట్టుగా పోస్టర్ లో ఉంది. ఈ పోస్టర్ చిరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ ను చిరు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేశారు.
Go Back to Shorts
Chiranjeevi
Acharya Movie
Tollywood
Motion Posterr

More Telugu News