మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు, లోకేశ్ ప్రత్యేక సందేశాలు
- నేడు చిరంజీవి జన్మదినం
- సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ
- శ్రమజీవి అంటూ కొనియాడిన చంద్రబాబు
- మరిన్ని జనరంజక పాత్రలు చేయాలన్న లోకేశ్
"మీ స్వయంకృషి, సామాజిక సేవాస్ఫూర్తి యువతకు ఆదర్శం. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. నారా లోకేశ్ స్పందిస్తూ, "మెగాస్టార్ చిరంజీవి గారూ, మీరు మరిన్ని జనరంజకమైన పాత్రలతో సినీ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉండాలని, నిండు నూరేళ్లు ఆనంద ఆరోగ్యాలతో ఉల్లాసంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను" అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.