Chiranjeevi: 'నేను మొదటి ఫొటో తీసింది ఇలాంటి కెమేరాతోనే..' అంటూ పోస్ట్ పెట్టిన చిరంజీవి

  • #WorldPhotographyDay హ్యాష్‌ట్యాగ్‌ జోడిస్తూ పోస్ట్
  • ఆ  మొదటి ఫోటో మరి కాసేపటిలో.. అన్న చిరు
  • నెటిజన్ల ఆసక్తికర కామెంట్లు
chiru on photography day

ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఈ రోజు పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు తమ సామాజిక మాధ్యమాల ఖాతాల్లో #WorldPhotographyDay హ్యాష్‌ట్యాగ్‌ జోడిస్తూ అరుదైన ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా  ఓ ఫొటోను పోస్ట్ చేస్తూ కాసేపట్లో మరో ఫొటోను పోస్ట్ చేస్తానని చెప్పారు.

'ఈ రోజు ప్రపంచ ఫొటోగ్రీఫీ డే.. నేను మొదటి ఫోటో తీసింది ఇలాంటి agfa3 కెమెరాతో. ఆ మొదటి ఫోటో మరి కాసేపటిలో..' అంటూ చిరంజీవి పోస్టు చేశారు. కాగా, కొన్ని నెలల క్రితమే ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చిరు ఆసక్తికర పోస్టులు చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తోన్న విషయం తెలిసిందే. షూటింగులు లేకపోవడంతో సినీనటులు అందరూ సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటున్నారు.

చిరు చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. 'మీ సినిమాతో మూడు గంటలు ప్రేక్షకులను థియేటర్ లో ఎలా కూర్చోబెట్టగలరో, ఇలా క్యూరియాసిటీతో నెక్ట్స్ ట్వీట్ వరకు ట్విట్టర్ లో కూడా అలాగే కూర్చోబెట్టగలరు బాస్ మీరు.. ట్విట్టర్ ని హ్యాండిల్ చేయుడంలో మీకు మీరే సాటి బాస్' అంటూ ఓ నెటిజన్ పేర్కొన్నాడు.

More Telugu News