deva katta: చంద్రబాబు, వైఎస్సార్ కథతో దేవ కట్టా ‘ఇంద్ర‌ప్ర‌స్థం’ సినిమా.. పోస్ట‌ర్‌ వీడియో విడుదల

  • వైఎస్సార్, చంద్రబాబు స్నేహం, వైరం ఆధారంగా సినిమా
  • ఫిక్ష‌న‌ల్ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా ‘ఇంద్ర‌ప్ర‌స్థం’
  • వైఎస్సార్, చంద్రబాబు అభివాదం చేస్తున్నట్లు పోస్టర్
devakatta new movie poster

ఆంధ్రప్రదేశ్  మాజీ సీఎంలు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు నాయుడుల స్నేహంతో పాటు రాజకీయ వైరం ఆధారంగా దర్శకుడు  దేవ కట్టా సినిమా తీస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తన ద‌ర్శ‌క‌త్వంలో రూపొందే ఈ సినిమాను ఆయన అధికారికంగా ప్రకటించారు.

ఈ ఫిక్ష‌న‌ల్ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌కు ‘ఇంద్ర‌ప్ర‌స్థం’ అనే పేరు పెట్టారు. ఇందుకు సంబంధించిన థీమ్ మోష‌న్ పోస్ట‌ర్‌ను ఈ రోజు ఈ సినిమా బృందం యూనిట్ విడుద‌ల చేసింది.  వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు అభివాదం చేస్తున్నట్లు ఉన్న వారి నీడ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
                                        వైఎస్సార్, చంద్రబాబుల మూడు దశాబ్దాల స్నేహం, రాజకీయ పోటీ వంటి అంశాలు ఇందులో ఉంటాయన్న ఊహాగానాలు హాట్ టాపిక్‌గా మారాయి. మామూలుగా ఓ పోటీ యొక్క ప్ర‌ధాన ఉద్దేశం విజేత‌ను క‌నుక్కోవ‌డ‌మేనని, ఇద్ద‌రు మిత్రులు పోటీలో పాల్గొన్న‌ప్పుడు చాలా ఆస‌క్తిక‌రంగా మారుతుందని డైలాగ్‌ను వినిపిస్తూ ఈ మోష‌న్ పోస్ట‌ర్‌ను దేవ కట్టా విడుదల చేశారు.

More Telugu News