సుశాంత్ సింగ్ పై అభిమానం... 'సడక్-2'పై ఆగ్రహమైంది!
- ఇటీవల విడుదలైన చిత్రం ట్రయిలర్
- అత్యధిక డిస్ లైక్ లు తెచ్చుకున్న వీడియో
- సుశాంత్ కు న్యాయం జరగాలని కామెంట్లు
బాలీవుడ్ లో బంధుప్రీతి కారణంగానే సుశాంత్ సూసైడ్ చేసుకున్నారన్న ఆరోపణలు, గతంలో మహేశ్ భట్, సుశాంత్ కు అన్యాయం చేశారన్న పుకార్ల నేపథ్యంలో, ఈ వీడియోకు అత్యధిక డిస్ లైక్స్ రావడం గమనార్హం.
ఇక ఈ సినిమా ట్రయిలర్ కింద సుశాంత్ కు న్యాయం జరగాల్సిందేనంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఈ ట్రయిలర్ కు ఏకంగా 30 లక్షలకు పైగా డిస్ లైక్స్ వచ్చాయి. ప్రపంచంలోనే అత్యధిక డిస్ లైక్ లు వచ్చిన ట్రయిలర్ గా ఇది నిలుస్తుందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.