చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సీడీపీ కాకుండా సీఎంపీ తీసుకొస్తున్నారట
- ఈ నెల 22 న చిరంజీవి పుట్టినరోజు
- సోషల్ మీడియాలో సందడికి సిద్ధమవుతున్న మెగా ఫ్యాన్స్
- సీఎంపీని విడుదల చేయబోతున్న మమ్ముట్టి
ఈనెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో హంగామా చేయడానికి మెగా ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. సీడీపీ కాకుండా... మరింత అడ్వాన్సుడు వర్షన్ అయిన సీఎంపీ (కామన్ మోషన్ పోస్టర్)ను రిలీజ్ చేయబోతున్నారట. దీని కోసం చిరంజీవి పీఆర్ టీమ్ ఒక వీడియోను రూపొందించింది. చిరు పుట్టినరోజుకు వారం ముందు అంటే ఆగస్ట్ 15వ తేదీన ఈ సీఎంపీని విడుదల చేయనున్నారు. ఇండస్ట్రీలోని 65 మంది ప్రముఖుల చేత దీన్ని సోషల్ మీడియాలో పెట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాదు, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టితో ఈ పోస్టర్ ను విడుదల చేయిస్తున్నారట.