క్యాన్సర్ బారినపడిన సంజయ్ దత్ కు యువరాజ్ సింగ్ సంఘీభావం
- ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్న సంజయ్ దత్
- ఓ ఫైటర్ లా పోరాడాలన్న యువరాజ్
- గతంలో క్యాన్సర్ నుంచి కోలుకున్న యువీ
"సంజయ్ దత్... ఇప్పుడు మీరు కూడా ఓ ఫైటర్ లా పోరాడాలి. మీరు మనసును మరింత దృఢంగా మలుచుకోవాలి. మీరు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను" అంటూ ట్విట్టర్ లో స్పందించారు. కాగా, అప్పట్లో క్యాన్సర్ కు చికిత్స కోసం యువరాజ్ సైతం అమెరికా వెళ్లారు. ఇప్పుడు సంజయ్ దత్ కూడా అమెరికా వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. పని నుంచి కొంత విరామం తీసుకుంటున్నానని సంజూ ప్రకటించారు.