Rhea Chakraborty: రియా, ఆమె సోదరుడిపై ప్రశ్నల వర్షం కురిపించిన ఈడీ అధికారులు

  • సుశాంత్ గాళ్ ఫ్రెండ్ రియాపై ఆరోపణలు
  • ఆర్థిక కోణంపై ఈడీ దర్యాప్తు
  • రియా, ఆమె సోదరుడిపై 7 గంటల పాటు విచారణ
ED grills Rhea and her brother in Sushant suicide case

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో ఆర్థిక కోణం ఉందన్న అనుమానంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు జరుపుతోంది. ఈ క్రమంలో సుశాంత్ గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తిలను ఈడీ అధికారులు ప్రశ్నించారు.

ఈ ఉదయం రియా, ఆమె సోదరుడు ముంబయిలోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. వీరిద్దరినీ ఈడీ అధికారులు దాదాపు 7 గంటల పాటు విచారించారు. సుశాంత్ కేసుకు సంబంధించి రియా, షోయిక్ లపై ఈడీ అధికారుల ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది.

ఈ ఉదయం రెండు గంటల పాటు ఈడీ ప్రశ్నావళిని ఎదుర్కొన్న షోయిక్ ఆపై కార్యాలయం నుంచి బయటికి వచ్చాడు. కొన్ని కీలక పత్రాలు తీసుకురావాలంటూ అతడిని ఈడీ అధికారులే బయటికి అనుమతించారని ఆ తర్వాత తెలిసింది. ఆపై షోయిక్ కాసేపటికే మళ్లీ ఈడీ కార్యాలయానికి రాగా, మరోసారి విచారించారు.

More Telugu News