Kajal Agarwal: అరగంట పాత్ర కోసం కాజల్ కు భారీ పారితోషికం!

Kajal charges a bomb for a guest role
షార్ట్స్‌లో చూడండి
హీరోయిన్లకు పారితోషికం వద్ద మొహమాటాలు వుండవు. తమ కెరీర్ స్పాన్ తక్కువగా వుంటుంది కాబట్టి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేసుకుంటారు. అందుకే, హీరోయిన్ వేషమైనా, ఐటం సాంగ్ అయినా, గెస్ట్ రోల్ అయినా తమ డిమాండును బట్టి నిర్మాత నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు. తాజాగా అందాలభామ కాజల్ అగర్వాల్ కూడా అలాగే ఓ సినిమాలో గెస్ట్ పాత్ర పోషించినందుకు భారీ మొత్తంలో ఛార్జ్ చేసిందట.

రానా కథానాయకుడుగా హిందీలో రూపొందుతున్న 'హాథీ మేరీ సాథీ' చిత్రంలో కాజల్ ఓ గెస్ట్ రోల్ చేసింది. ఇందులో ఆమె పాత్ర నిడివి అరగంట సేపు మాత్రమే ఉంటుందట. ఇందుకు గాను ఆమె సుమారు 70 లక్షలు తీసుకున్నట్టు సమాచారం. ఇందులో ఆమె ఆదివాసీ యువతిగా కనిపిస్తుంది. దీంతో వాళ్ల సంప్రదాయాల ప్రకారం బ్లౌజ్ వేసుకోకుండా కేవలం చీరకట్టులోనే అమ్మడు కనిపిస్తుందట.
Go Back to Shorts
Kajal Agarwal
Rana
Hathi Meree Sathi

More Telugu News