Sensex: కీలక రేట్లను మార్చని ఆర్బీఐ.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Stock Markets ends in profits
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈనాటి మానిటరీ పాలసీలో కీలక వడ్డీ రేట్లను (రెపో, రివర్స్ రెపో) ఆర్బీఐ యథాతథంగా ఉంచింది. ఈ నేపథ్యంలో మార్కెట్లు లాభాల్లో పయనించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 362 పాయింట్లు లాభపడి 38,025కి పెరిగింది. నిఫ్టీ 99 పాయింట్లు పుంజుకుని 11,200 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (3.82%), ఇన్ఫోసిస్ (2.60%), బజాజ్ ఫైనాన్స్ (2.54%), టీసీఎస్ (2.16%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.11%).

టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-0.60%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.48%), ఎల్ అండ్ టీ (-0.44%), యాక్సిస్ బ్యాంక్ (-0.43%), బజాజ్ ఆటో (-0.35%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News