Corona Virus: తెలంగాణలో మరో 2,012 మందికి సోకిన కరోనా

coronavirus cases in telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 2,012 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో 1,139 మంది కోలుకోగా, 13 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.  

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 70,958కి చేరింది. ఆసుపత్రుల్లో 19,568 మందికి చికిత్స అందుతోంది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా నుంచి 50,814 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 576కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 532 కరోనా కేసులు నమోదయ్యాయి.
Go Back to Shorts
Corona Virus
COVID-19
Telangana

More Telugu News