ఎంతో ప్రేమతో పెంచుకున్న నా కుక్క... విశ్వాసం చూపలేదంటూ నటుడు నాగబాబు పోస్ట్ చేసిన వీడియో!
Add ap7am to your home Screen

ఎంతో ప్రేమతో పెంచుకున్న నా కుక్క... విశ్వాసం చూపలేదంటూ నటుడు నాగబాబు పోస్ట్ చేసిన వీడియో!

Actor Nagababu Posted Video on His Pet Dog Goes Viral
  • నవ్వులు పూయిస్తున్న నాగబాబు వీడియో
  • భార్యకు పాములపై భయాన్ని పోగొట్టాలని బొమ్మ పాము
  • దాన్ని చూసి హడలి పారిపోయిన శునకం
మనిషికి శునకాలతో ఎంత అనుబంధం ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తమను పెంచుకునే వారిపై అవి ఎంతో విశ్వాసాన్ని చూపిస్తుంటాయి. అయితే, తాను పెంచుకుంటున్న శునకం గురించిన ఓ ఆసక్తికరమైన వీడియోను నటుడు నాగబాబు పంచుకున్నారు. తన యజమానిని రక్షించాలన్న విశ్వాసాన్ని అది చూపలేదని వ్యాఖ్యానిస్తూ పెట్టిన ఈ వీడియో నవ్వులను పూయిస్తూ, వైరల్ అయింది.

తాను 2006 నుంచి ఓ కుక్కను పెంచుకుంటూ, దానికి పీకూ అని పేరు పెట్టుకున్నానని, ఇది ఎవరైనా తనపైకి వస్తే, వారి మీద భీకరంగా దాడి చేస్తానన్నట్టుగా ఇంతకాలమూ కలరిచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలో, ఇటీవల జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియోను ఆయన పంచుకున్నారు. తన భార్య పద్మకు పాములంటే భయమని, ఆ భయాన్ని తొలగించేందుకు ఓ రబ్బర్ పామును తెచ్చి చూపిస్తున్న వేళ జరిగిన ఘటన ఇదని, దీని తీరువాత శునకాలు విశ్వాసాన్ని చూపిస్తాయన్న తన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని నాగబాబు వ్యాఖ్యానించారు. ఆయన అలా ఎందుకన్నారో ఈ వీడియో చూస్తే మీకే తెలిసిపోతుంది.

Nagababu
Viral Videos
Snake
Dog
Piku

More Telugu News