వర్కౌట్లు బాగా చేస్తే ఒళ్లు నొప్పులు వచ్చాయేమో అనుకున్నా, కానీ కరోనా పాజిటివ్ వచ్చింది: గాయని స్మిత
- గాయని స్మితకు కరోనా
- ఆమె భర్త శశాంక్ కు కూడా కరోనా పాజిటివ్
- ఇంట్లోనే ఉన్నా కరోనా వచ్చిందని ట్వీట్
తన భర్త శశాంక్ కు కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని స్మిత వెల్లడించింది. అయితే తమలో పెద్దగా లక్షణాలేవీ లేవని, ఈ మహమ్మారిని తమ శరీరాల్లోంచి తన్ని తరిమేందుకు వేచిచూస్తున్నామని, కరోనా తగ్గితే ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్మిత వివరించింది. తాము ఇంట్లోనే ఉన్నా కరోనా తమ ఇంటి వరకు వచ్చిందని ట్వీట్ చేసింది.