తెలంగాణలో మద్యం దుకాణాల వేళల పొడిగింపు
Add ap7am to your home Screen

తెలంగాణలో మద్యం దుకాణాల వేళల పొడిగింపు

Liquor shop timings in Telangana extended
  • లాక్‌డౌన్ తర్వాత మే నుంచి తెలంగాణలో తెరుచుకున్న మద్యం షాపులు
  • రెండు దఫాలుగా రాత్రి 9.30 వరకు సమయం పెంపు
  • తాజాగా మరో గంటన్నర పెంచుతూ ఉత్తర్వులు
తెలంగాణలో మద్యం దుకాణాల వేళలను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాత్రి 9.30 గంటల వరకు అనుమతి ఉండగా,  ఇప్పుడు దానిని మరో గంటన్నర పెంచారు. ఫలితంగా రాత్రి 11 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచే ఉండనున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. లాక్‌డౌన్ కారణంగా మూతబడిన మద్యం షాపులు మే ఆరో తేదీన తిరిగి తెరుచుకున్నాయి. తొలుత సాయంత్రం ఏడున్నర గంటల వరకే అనుమతి ఇవ్వగా, ఆ తర్వాత రెండు దఫాలుగా 9.30 గంటల వరకు సమయాన్ని పెంచారు. ఇప్పుడు మరో గంటన్నర పెంచిన ప్రభుత్వం రాత్రి 11 గంటల వరకు మద్యం అమ్ముకునే వెసులుబాటును కల్పించింది. కాగా, నిన్నటి నుంచే పెంచిన వేళలు అమల్లోకి వచ్చాయి.
liqor shops
Telangana
timings
excise ministry

More Telugu News