సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య అయితే ముఖంపై ఇవేంటి?...ఓ డాక్టర్ సంచలన వీడియో

03-08-2020 Mon 14:04
  • సుశాంత్ ది ఆత్మహత్య అంటూ ఫోరెన్సిక్ నివేదిక
  • అయితే ముఖంపై గాయాలు ఎందుకున్నాయన్న డాక్టర్ మీనాక్షి
  • కంటిపై ఎవరో గుద్దినట్టుగా ఉందని వీడియోలో వెల్లడి
  • వీడియోను పంచుకున్న బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి
Sensational video on Sushant issue by a doctor
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది ఆత్మహత్యేనని ఫోరెన్సిక్ నివేదిక తేల్చిన సంగతి తెలిసిందే. అయితే మీనాక్షి మిశ్రా అనే వైద్యురాలు మాత్రం ఇది ఆత్మహత్య కాదని, సుశాంత్ మృతదేహం పరిశీలిస్తే హత్య అనిపిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఆమె ప్రత్యేకంగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోను బీజేపీ అగ్రనేత సుబ్రహ్మణ్యస్వామి రీట్వీట్ చేశారు.

కాగా, డాక్టర్ మీనాక్షి తన వీడియోలో సుశాంత్ ముఖంపై ఉన్న గాయాలను చూపించారు. ముఖ్యంగా కంటిపై ఎవరో గుద్దినట్టుగా ఉందని, కంటిపైభాగంలో ఉబ్బిపోయి ఉండడమే అందుకు కారణమని వివరించారు. సాధారణంగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటే కళ్లు బయటికి పొడుచుకు వచ్చినట్టుగా ఉంటాయని, నాలుక కూడా బయటికి సాగి ఉంటుందని వెల్లడించారు. కానీ సుశాంత్ విషయంలో అలా జరగలేదని, ఓ కన్ను సగం తెరుచుకుని ఉందని, నాలుక కూడా మామూలుగానే ఉందని తెలిపారు. అతడిపై దాడి జరిగుండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.