తెలంగాణలో కొత్తగా 983 కరోనా కేసులు
Add ap7am to your home Screen

తెలంగాణలో కొత్తగా 983 కరోనా కేసులు

more 983 coronavirus cases in telangana
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 67,660
  • ఆసుపత్రుల్లో 18,500 మందికి చికిత్స
  • 48,609 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 551  
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 983 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో 11 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.  

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 67,660 కి చేరింది. ఆసుపత్రుల్లో 18,500 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 48,609 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 551కి చేరింది. జీహెచ్‌ఎంసీలో 273 మందికి కొత్తగా కరోనా సోకింది. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 73 కేసులు నమోదయ్యాయి.
                                              
Corona Virus
COVID-19
Telangana

More Telugu News