Rakul Preet Singh: పవన్ కల్యాణ్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్?

  • టాలీవుడ్ లో రకుల్ కి తగ్గిన అవకాశాలు
  • పవన్, క్రిష్ సినిమా నుంచి ఆఫర్
  •  మొగలాయీ పాలన కాలం నాటి కథ
Rakul to play lead role opposite Pawan Kalyan

ఒక సమయంలో తెలుగులో టాప్ హీరోయిన్ స్థానానికి ఎగబాకి.. టాప్ హీరోలందరితోనూ నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల వెనుకపడింది. కొత్త హీరోయిన్ల తాకిడితో ఆమెకు ఇక్కడ అవకాశాలు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మకి టాలీవుడ్ నుంచి ఓ బిగ్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అది కూడా పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశం రావడం విశేషం!

పవన్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న పిరీడ్ మూవీలో కథానాయిక పాత్రకు రకుల్ తో సంప్రదింపులు జరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో నటించే హీరోయిన్లుగా బాలీవుడ్ భామ జాక్విలిన్ ఫెర్నాండెజ్, ప్రగ్యా జైస్వాల్ వంటి పేర్లు వినిపించాయి. మరి, రకుల్ ని మరో హీరోయిన్ గా తీసుకుంటున్నారా? అన్నది తెలియాల్సివుంది.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే, 'వకీల్ సాబ్' సినిమాతో పాటు ఈ చిత్రాన్ని కూడా పవన్ మొదట్లోనే అంగీకరించారు. లాక్ డౌన్ కి ముందు కొంత షూటింగ్ కూడా నిర్వహించారు. మొగలుల పాలనా కాలం నాటి వాతావరణంలో ఈ చిత్రకథ సాగుతుందని అంటున్నారు. దీనికి 'విరూపాక్ష' అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు కూడా ఇంతకుముందే ప్రచారం జరిగింది.    

More Telugu News