Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు మరో గంట అదనపు సమయం

  • ఇటీవలే పునఃప్రారంభమైన మద్యం దుకాణాలు
  • ఇప్పటిదాకా ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతి
  • ఇకపై రాత్రి 9 గంటల వరకు దుకాణాలు
Extra time for liquor shops in AP

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక మద్యం షాపులు మూతపడిన సంగతి తెలిసిందే. అయితే, లాక్ డౌన్ ఆంక్షల సడలింపు నేపథ్యంలో మద్యం దుకాణాలు పునఃప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే వాటికి అనుమతి ఇచ్చారు. ఇప్పుడా వేళలను ఏపీ ప్రభుత్వం సవరించింది. మరో గంట అదనపు సమయం ఇస్తున్నట్టు సర్కారు పేర్కొంది. ఇకపై ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో తెలిపింది. ఏదేమైనా ఇది మందుబాబులకు కాస్తంత ఊరటనిచ్చే విషయమే!

More Telugu News