Tollywood: 'బిచ్చగాడు-2' సినిమా పోస్టర్‌ విడుదల

  • గతంలో 'బిచ్చగాడు'తో భారీ హిట్ కొట్టిన విజ‌య్ ఆంటోనీ 
  • ప్రియా కృష్ణ‌స్వామి దర్శకత్వంలో సినిమా
  • తెలుగు, తమిళ భాషల్లో 2021లో విడుద‌ల
On the occasion of his Birthday vijayantony  announces  Bitchagadu2

కొన్నాళ్ల క్రితం అమ్మ సెంటిమెంట్ కథాంశంగా వచ్చిన 'బిచ్చగాడు' సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కథానాయకుడిగా విజయ్ ఆంటోనీకి ఆ చిత్రం మంచి పేరును తెచ్చింది. ఇప్పుడీ చిత్రానికి తమిళ, తెలుగు భాషల్లో సీక్వెల్ రూపొందుతోంది.

ఈ సినిమాకు సంబంధించిన తమిళ, తెలుగు పోస్టర్‌లను ఆ సినిమా బృందం తాజాగా విడుదల చేసింది. ఈ రోజు విజయ్ ఆంటోని పుట్టినరోజు సందర్భంగా దీన్ని విడుదల చేస్తున్నట్లు ఆ సినీ బృందం తెలిపింది. విజయ్ ఆంటోనియే నిర్మాత‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకి తెలుగులో 'బిచ్చగాడు-2'గా, తమిళంలో ‘పిచ్చైకారన్-2’గా పేరు పెట్టారు. ప్రియా కృష్ణ‌స్వామి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాను  2021లో విడుద‌ల చేస్తారు.

More Telugu News