ప్రపోజ్ చేస్తూ, అభిమాని లవ్ లెటర్... భద్రంగా దాచుకున్నానన్న కీర్తి సురేశ్
Add ap7am to your home Screen

ప్రపోజ్ చేస్తూ, అభిమాని లవ్ లెటర్... భద్రంగా దాచుకున్నానన్న కీర్తి సురేశ్

Keerthi Suresh GetsLove Letter from Fan
  • ఓ షాప్ ఓపెనింగ్ కు వెళితే అభిమాని నుంచి బహుమతి
  • ఫోటో ఆల్బమ్ తో పాటు లవ్ లెటర్
  • ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన కీర్తి
దక్షిణాది చిత్ర సీమలో మంచి నటిగా రాణిస్తున్న అందాల నటి కీర్తి సురేశ్, ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాలేజీ రోజుల్లో తనకు ఎన్ని లవ్ లెటర్స్ వచ్చాయన్న ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చింది.

తనకు కాలేజీ రోజుల్లో ఎవరూ ప్రేమ లేఖను రాయలేదని చెప్పిన ఆమె, "నేను ఒకసారి జ్యూయెలరీ షాప్ ఓపెనింగ్ కు వెళ్లాను. అక్కడికి వచ్చిన ఓ అభిమాని, నాకు ఓ బహుమతిని ఇచ్చి వెళ్లాడు. అందులో నా ఫోటోలను అల్బమ్ గా ఎంతో చక్కగా అమర్చాడు. వాటితో పాటే ఓ ఉత్తరాన్ని కూడా అతను రాశాడు. అందులో ఏముందని చూస్తే, నాకు ప్రపోజ్ చేస్తూ లవ్ లెటర్ రాశాడు. దాన్ని నేను చాలా భద్రంగా దాచుకున్నాను" అని చెప్పింది. తాజాగా కీర్తి నటించిన 'గుడ్ లక్ సఖి', 'రంగ్ దే' చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి.
Keerthi Suresh
Love Letter
Fan

More Telugu News