సీఎం కేసీఆర్ ను పెళ్లికి ఆహ్వానించిన హీరో నితిన్
- జూలై 26న నితిన్ పెళ్లి
- షాలినీతో నితిన్ వివాహం
- కరోనా వ్యాప్తి కారణంగా ఆలస్యమైన పరిణయం
వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నితిన్ పెళ్లి పనులు ప్రారంభమైనా, కరోనా వ్యాప్తి కారణంగా పెళ్లి ఆలస్యమైంది. వాస్తవానికి నితిన్, షాలిని పెళ్లి ఏప్రిల్ 16నే జరగాల్సి ఉంది. భారీస్థాయిలో ఈ వివాహ మహోత్సవం నిర్వహించాలని ఇరుకుటుంబాల వారు నిశ్చయించినా, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఓ మోస్తరు వేడుక మాత్రమే జరపాలని భావిస్తున్నారు.