'పవర్ స్టార్' ట్రైలర్ చూడాలన్నా డబ్బులు చెల్లించాల్సిందే... రేటు ఫిక్స్ చేసిన వర్మ
- కరోనా కాలంలోనూ సినిమాలు తీస్తున్న వర్మ
- తన సొంత ప్లాట్ ఫామ్ పై ప్రదర్శన
- ట్రైలర్ కు రూ.25 చెల్లించాలని వెల్లడి
అంతేకాదు, పవర్ స్టార్ సినిమా చూసేందుకు వర్మ ప్రేక్షకులకు ఓ ఆఫర్ కూడా ఇచ్చారు. జూలై 25వ తేదీ ఉదయం 11 గంటల వరకు పవర్ స్టార్ సినిమాకు రూ.150 చెల్లిస్తే సరిపోతుందని, జూలై 25వ తేదీ ఉదయం 11 గంటల నుంచి రూ.250 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. అందుకే విడుదల వరకు ఆగకుండా ముందే బుక్ చేసుకుని రూ.100 ఆదా చేసుకోండి అంటూ వర్మ ట్విట్టర్ లో వెల్లడించారు.