Lok Sabha: 'ఒక మెట్టు ఎక్కాను'.. లోక్‌సభలో తన సీటు మార్పుపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు

raghurama krishnam raju ong changing seat in loksabha
షార్ట్స్‌లో చూడండి
లోక్‌సభలో తన స్థానం మార్చినంత మాత్రాన పెద్ద తేడా ఏమీ ఉండబోదని  వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణ రాజు  చెప్పారు. తనను మరో మెట్టు ఎక్కించారనుకుంటానని తెలిపారు. తమ పార్టీలో తనను వెలివేశారని ఆయన చెప్పారు. అయినప్పటికీ తాను ఎన్నడూ సీఎం జగన్‌కు, తన పార్టీకి విధేయుడినేనని అన్నారు.

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో తాను పలు అంశాలపై చర్చించానని, అయితే, అవి ఏంటో ఇప్పుడు చెప్పలేనని రఘురామకృష్ణ రాజు  అన్నారు. రాష్ట్ర రాజకీయాలపైనా జేపీ నడ్డాతో చర్చించానని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితుల గురించి తనకు తెలియదని, తనకు మాత్రం ఏపీలో భద్రతలేదని వ్యాఖ్యానించారు.

కరోనా ప్రభావంతో విధించిన లాక్‌డౌన్‌ వల్ల తాను మూడు నెలల పాటు హైదరాబాద్‌లో ఉన్నానని, అయినప్పటికీ తనపై కొందరు కేసులు పెట్టారని ఆయన వాపోయారు. 
Go Back to Shorts
Lok Sabha
raghuramakrishnaraju
YSRCP

More Telugu News