పరిగెత్తుకెళ్లి బస్సును ఆపి.. కంటి చూపు లేని వృద్ధుడికి మహిళ సాయం.. వీడియో వైరల్
Add ap7am to your home Screen

పరిగెత్తుకెళ్లి బస్సును ఆపి.. కంటి చూపు లేని వృద్ధుడికి మహిళ సాయం.. వీడియో వైరల్

kerala woman helps a man
  • కేరళలో ఘటన
  • వీడియో పోస్ట్ చేసిన ఐపీఎస్ అధికారి విజయ్‌ కుమార్
  • మహిళకు సెల్యూట్ కొడుతున్న నెటిజన్లు
పరిగెత్తుకెళ్లి బస్సును ఆపి, కంటి చూపు లేని ఓ వృద్ధుడిని తీసుకెళ్లి బస్సు ఎక్కించిన ఓ మహిళ నలుగురికీ ఆదర్శంగా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియోను విజ‌య్ కుమార్ అనే ఐపీసీ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. సదరు మహిళపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‌

ఓ బస్సు ఎక్కుదామని కంటి చూపు లేని వృద్ధుడు ప్రయత్నించాడు. అయితే, అది అప్పటికే ముందుకు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని గమనించిన అక్కడి ఓ మహిళ పరుగులు తీసి బస్సుని ఆపి కాసేపు ఉండమని కోరింది. మళ్లీ వెనక్కి పరిగెత్తి ఆ వృద్ధుడి చేతిని పట్టుకుని వచ్చి బస్సు ఎక్కించి వెళ్లిపోయింది. ఆమె చూపిన మానవత్వానికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.
Kerala
Viral Videos

More Telugu News