ప్రముఖ సినీ నటి సుమలతకు కరోనా పాజిటివ్
- శనివారం నుంచి స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న సుమలత
- ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్న సుమలత
- తనను కలిసిన వాళ్లు కూడా టెస్టు చేయించుకోవాలని సూచన
భగవంతుడి అనుగ్రహం వల్ల తనలో వ్యాధి నిరోధక శక్తి మెరుగైన స్థాయిలో ఉందని, అభిమానులందరి మద్దతుతో త్వరలోనే కోలుకోగలనన్న ఆత్మవిశ్వాసం తనకుందని స్పష్టం చేశారు. తాను ఇప్పటివరకు కలిసిన వారందరి వివరాలు అధికారులకు వెల్లడించానని సుమలత పేర్కొన్నారు. ఇంకా ఎవరినైనా తాను కలిసినట్టయితే, వారిలో ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనాపై మనం కచ్చితంగా జయించగలం అంటూ ట్వీట్ చేశారు.