WHO: గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతుంది: 32 దేశాల పరిశోధకులు

Coronavirus Is Airborne  Say Scientists
షార్ట్స్‌లో చూడండి
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా.. గాలిలోని సూక్ష్మ రేణువుల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని  వందలాది పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకు తమ వద్ద ఆధారాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు తెలిపారు.

ఈ మేరకు కరోనా వ్యాప్తిపై సిఫార్సులను సవరించాలని వారు కోరారు. తాజాగా, ఈ విషయంపై డబ్ల్యూహెచ్‌వోకు 32 దేశాలకు చెందిన 239 మంది పరిశోధకులు లేఖ రాశారు. కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి దగ్గు, తుమ్ములు, మాట్లాడేటప్పుడు వచ్చే తుంపరల నుంచి వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్‌వో ఇప్పటికే  చెప్పింది.

గాలి ద్వారా ఆ వైరస్‌‌ వ్యాప్తి చెందుతుందన్న విషయంపై డబ్ల్యూహెచ్‌వో ప్రకటన చేయలేదు. ఈ పరిశోధనల వివరాలను పరిశోధకులు కొన్ని రోజుల్లో సైంటిఫిక్‌ జర్నల్‌లో ప్రచురించనున్నారు. కరోనా ఉన్న వ్యక్తి దగ్గినా, తుమ్మినా వచ్చే తుంపరల పరిమాణం ఎక్కువగా ఉంటే ఆ వైరస్‌ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు కొత్తగా గుర్తించారు. అయితే, కరోనా  గాలి ద్వారా వ్యాప్తి చెందుతున్న విషయానికి సంబంధించిన ఆధారాలు సరిగాలేవని డబ్ల్యూహెచ్‌వో అంటోంది.

Go Back to Shorts
WHO
Corona Virus
COVID-19

More Telugu News