హ్యాపీ బర్త్ డే అన్నా: జూనియర్ ఎన్టీఆర్!
- నేడు కల్యాణ్ రామ్ పుట్టిన రోజు
- ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్ అభినందనలు
- విషెస్ చెబుతున్న పలువురు సెలబ్రిటీలు
కాగా, గతంలో ఎన్టీఆర్ హీరోగా, కల్యాణ్ రామ్ 'జై లవకుశ' చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న చిత్రంలోనూ భాగమయ్యాడు. ప్రస్తుతం మల్లిడి వేణు దర్శకత్వంలో ఓ చిత్రంలో కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్నాడు. అతని పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు.