pvp: తదుపరి ఆదేశాలిచ్చే వరకు పీవీపీని అరెస్టు చేయొద్దు: హైకోర్టు

  • తన ఇంటి నిర్మాణాన్ని అడ్డుకున్నారని పీవీపీపై కేసు
  • విచారణకు హాజరుకాకుండా ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్
  • బెయిల్‌పై మధ్యంతర ఉత్తర్వులు 
  • విచారణ ఈ నెల 27కు వాయిదా 
high court on pvp petition

వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వర ప్రసాద్‌(పీవీపీ)పై ఇటీవల హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసు స్టేషనులో పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే. తన ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుని ఆయన దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఓ వ్యక్తి ఇటీవల చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసుల విషయంలో ఆయనకు ఈ రోజు హైకోర్టులో ఊరట లభించింది.

ఈ కేసులో పోలీసు విచారణకు హాజరుకాకుండా ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో ఆయన పిటిషన్‌ దాఖలు చేయగా, దానిపై ఈ రోజు విచారణ చేపట్టిన హైకోర్టు బెయిల్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి ఆదేశాలిచ్చే వరకు పీవీపీని అరెస్టు చేయవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.

More Telugu News