అమ్మాయితో ఇంత రాత్రి పూట ఎక్కడికెళుతున్నావంటూ ఓ వ్యక్తిని కొట్టి చంపిన వైనం

man assassinates in punjab
  • పంజాబ్‌లో ఘటన
  • ఆమె తన భార్య అని చెప్పినా వినని వైనం
  • పరారీలో ఇద్దరు నిందితులు
భార్యతో కలిసి ఓ వ్యక్తి రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే, అతడిని అడ్డగించిన ఇద్దరు వ్యక్తులు అమ్మాయితో ఇంత రాత్రి పూట ఎక్కడికెళుతున్నావంటూ కొట్టి చంపేశారు. ఈ ఘటన పంజాబ్‌లోని పటియాలలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు తెలిపారు.  

బీహార్‌కు చెందిన మిథున్‌ పాటేల్‌ అనే వ్యక్తి ఉపాధి నిమిత్తం పంజాబ్‌లోని పటియాలకు వచ్చి అక్కడి ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో తన భార్యతో కలిసి గురుద్వారా దుఖ్‌ నివారణ్‌ సాహిబ్‌కు వెళ్తుండగా వారిని అడ్డగించిన జగ్‌మోహన్‌ సింగ్‌, భూపేందర్‌ సింగ్‌ అనే ఇద్దరు వ్యక్తులు.. అమ్మాయితో అర్ధరాత్రి ఎందుకు వెళ్తున్నావంటూ మిథున్‌తో గొడవ పెట్టుకున్నారు.

ఆమె తన భార్య అని, తామిద్దరం కలిసి గురుద్వారాకు వెళుతున్నామని చెప్పినప్పటికీ వారు దారుణంగా వ్యవహరించి, రాళ్లు, ఇటుకలతో దాడి చేసి చంపేశారు. ఈ ఘటనలో పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
punjab
Crime News

More Telugu News