పాక్ క్రికెట్ టీమ్ లో తీవ్ర కలకలం... హైదర్, రౌఫ్, షాదాబ్ లకు కరోనా!
- ఇంగ్లండ్ టూర్ కు ముందు పరీక్షలు
- లక్షణాలు లేకుండానే శరీరంలో వైరస్
- వెల్లడించిన పీసీబీ
వాస్తవానికి వారిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని, అయినా ఇంగ్లండ్ తో పర్యటనకు ముందు వీరికి టెస్టులు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి పరీక్షలు జరిపించామని అధికారులు తెలిపారు. ఆదివారం నాడు రావల్పిండిలో క్రికెటర్లందరి నమూనాలు సేకరించి, పరీక్షలకు పంపామని, ఆపై వీరు ముగ్గురికీ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందని వెల్లడించారు. ముగ్గురు క్రికెటర్లకు కరోనా సోకడంతో ఇతర క్రీడాకారుల్లో ఆందోళన నెలకొంది.