సుశాంత్ మరణంతో నెటిజన్ల ఆగ్రహం.. సోషల్ మీడియాలో ‘బాయ్‌కాట్ బాలీవుడ్’

Netizens Called Bollywood Boycott
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత అభిమానుల వైఖరిలో మార్పు వచ్చింది. ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తుల వల్ల సుశాంత్ పలు సందర్భాల్లో తీవ్ర మనస్తాపానికి గురైనట్టు వార్తలు వచ్చాయి. సుశాంత్ ఆత్మహత్యకు గల కారణాల్లో ఇది కూడా ఒకటని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీరంగంలో అడుగుపెట్టిన సుశాంత్‌కు బాలీవుడ్ పెద్దల నుంచి సరైన ప్రోత్సాహం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు ‘బాయ్‌కాట్ బాలీవుడ్’ పేరుతో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.

బాలీవుడ్‌లోని అగ్ర నిర్మాతలు, దర్శకులు అందరూ వారసత్వ నటులకే ఆఫర్లు ఇస్తున్నారని, అవార్డు వేడుకల్లో సైతం వారికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ పోస్టులతో విరుచుకుపడుతున్నారు. ఇలాంటి వారిని అన్‌ఫాలో చేయాలని, వారి సినిమాలను నిషేధించాలంటూ పెడుతున్న పోస్టులకు స్పందన లభిస్తోంది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియాల్లో సదరు నటీనటులు, దర్శక నిర్మాతలను అన్‌ఫాలో చేస్తున్నారు.
Go Back to Shorts
Sushant Singh Rajput
Bollywood
Social Media
Boycott

More Telugu News