Mohan Babu: మోహన్ బాబుకు పాదాభివందనం చేసిన రజనీకాంత్... నాటి జ్ఞాపకాలను పంచుకున్న డైలాగ్ కింగ్

  • 1995 జూన్ 15న రిలీజైన పెదరాయుడు
  • బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం
  • ముహూర్తం షాట్ వీడియోను ట్వీట్ చేసిన మోహన్ బాబు
Mohan Babu shares Pedarayudu opening shot video

మోహన్ బాబు, సౌందర్య, రజనీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం పెదరాయుడు. 1995 జూన్ 15న రిలీజైన పెదరాయుడు బాక్సాఫీసు వద్ద రికార్డుల మోత మోగించాడు. ఈ సినిమాకు పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా మోహన్ బాబు నాటి జ్ఞాపకాలను ట్విట్టర్ లో పంచుకున్నారు. నాడు పెదరాయుడు ఓపెనింగ్ షాట్ సమయంలో తీసిన వీడియోను ట్వీట్ చేశారు. ఎంత మధురమైన జ్ఞాపకాలు అంటూ మురిసిపోయారు. ఈ సినిమా ఓపెనింగ్ కు సీనియర్ ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి సహా హాజరై ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టడం ఈ వీడియోలో చూడొచ్చు. అంతేకాదు, పాపారాయుడు గెటప్ లో ఉన్న రజనీకాంత్... మోహన్ బాబుకు పాదాభివందనం చేసిన క్షణాలను కూడా ఈ వీడియోలో పొందుపరిచారు.


More Telugu News