Disha Salian: ఐశ్వర్యారాయ్ మాజీ మేనేజర్ దిశా సలియాన్ ఆత్మహత్య

Aishwarya Rai Ex manager Disha Salian suicide
  • 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య
  • ఘటన జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్న భర్త
  • ముంబైలోని మలాద్ ప్రాంతంలో నివాసం ఉన్న దిశా
బాలీవుడ్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ మాజీ మేనేజర్ దిశా సలియాన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముంబైలోని మలాద్ ప్రాంతంలో ఆమె నివాసం ఉంటున్నారు. తను ఉంటున్న అపార్ట్ మెంట్ 14వ అంతస్తు నుంచి దూకి ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. సూసైడ్ చేసుకున్న సమయంలో ఆమె భర్త ఇంట్లోనే ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే ఆమెను బొరివలి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలను కోల్పోయినట్టు వైద్యులు తెలిపారు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు వరుణ్ శర్మ, సుశాంత్ సింగ్ వద్ద కూడా దిశా సలియాన్ మేనేజర్ గా పని చేశారు. ఆమె మరణ వార్త విని బీటౌన్ షాక్ కు గురైంది.
Disha Salian
Aishwarya Rai
Suicide
Bollywood

More Telugu News