శ్రీశైలంలో ఉద్యోగులు, గిరిజనులకు నిత్యావసరాలు అందించిన ఉపాసన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీశైలంలో ఉద్యోగులు, గిరిజనులకు నిత్యావసరాలు అందించిన ఉపాసన

Upasana distributes essentials in Srisailam
  • శ్రీశైలంలో ఉపాసన దాతృత్వం
  • పెద్ద ఎత్తున నిత్యావసరాల పంపిణీ
  • తాత్కాలిక ఉద్యోగులకు, 300 మంది గిరిజనులకు సాయం
టాలీవుడ్ యువ హీరో రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన కొణిదెల పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి చేయూత అందించారు. శ్రీశైలం అటవీశాఖ బేస్ క్యాంప్ తాత్కాలిక ఉద్యోగులకు, 300 మంది స్థానిక గిరిజనులకు అన్నిరకాల నిత్యావసర సరుకులను ఉపాసన పంపిణీ చేశారు. లారీల్లో తీసుకువచ్చిన బియ్యం, ఇతర వస్తువులను స్వయంగా అందించారు.
Upasana
Srisailam
Essentials
Temporary Employs
Tribals
Lockdown
Corona Virus

More Telugu News