కాఫీ డే సిద్ధార్థ తనయుడికి , కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ కుమార్తెకు పెళ్లి!
- వివాహంతో ఒక్కటి కానున్న అమర్త్య హెగ్డే, ఐశ్వర్య
- జూలై 31 తర్వాత పెళ్లి తేదీ నిర్ణయిస్తామన్న శివకుమార్
- గతేడాది ఆత్మహత్య చేసుకున్న కాఫీ డే సిద్ధార్థ
కాగా, 2019లో కాఫీ డే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సిద్థార్థ బతికున్నప్పుడే ఈ పెళ్లి ప్రస్తావన వచ్చిందని డీకే శివకుమార్ తెలిపారు. జూలై 31 నాటికి సిద్ధార్థ మరణించి ఏడాది అవుతుందని, ఆ తర్వాత పెళ్లి తేదీ నిర్ణయిస్తామని వెల్లడించారు. సిద్ధార్థ ఎవరో కాదు... మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడే. ఎస్ఎం కృష్ణను అటు డీకే శివకుమార్ తన మార్గదర్శి అని చెబుతుంటారు.