సడలింపులు ఇస్తుండడంతో ఇది పోయిందనుకుంటున్నారు... ఈ వైరస్ ఎక్కడికీ పోలేదు!: డబ్ల్యూహెచ్ఓ
- అనేక దేశాల్లో సడలింపు బాట
- వైరస్ ప్రభావం తగ్గిందనుకుంటున్నారన్న డబ్ల్యూహెచ్ఓ
- ఎవరి జాగ్రత్త వాళ్లు చూసుకోవాలని స్పష్టీకరణ
యూరప్ దేశాల్లోనే కాకుండా ఇతర ఖండాల్లోనూ అనేక దేశాల్లో భౌతికదూరం సహా అనేక అంశాల్లో సడలింపులు ఇస్తుండడంతో ఈ వైరస్ ప్రభావం పోయిందన్న భావన ప్రజల్లో కలుగుతోందని డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి మార్గరెట్ హ్యారిస్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వైరస్ ఎక్కడికీ పోలేదని, ప్రపంచంలో ఎక్కడా ఈ వైరస్ లేదు అనేంతవరకు దీన్ని ఓ ముప్పుగానే పరిగణించాలని ఆమె పేర్కొన్నారు.