elephant: ఏనుగు మృతి నేపథ్యంలో.. హృదయాన్ని ద్రవింపజేస్తోన్న కార్టూన్లు, ఫొటోలు ఇవిగో!

  • కేరళ ఘటనపై కార్టూన్లు
  • సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌
  • మానవాళి సిగ్గుపడాల్సి వస్తోందని చిత్రకారుల ఆవేదన  
cartoons on elephant death

కేరళలోని మలప్పురంలో ఓ ఆడ ఏనుగును కొందరు దారుణంగా చంపిన ఘటనపై ఆగ్రహ జ్వాల ఇంకా చల్లారలేదు. తల్లి ఏనుగు కడుపులో గున్న ఏనుగుతో పలువురు వేసిన కార్టూన్లు హృదయాన్ని ద్రవించజేసేలా ఉన్నాయి.  చనిపోయిన ఆడ ఏనుగు, దాని కడుపులోని పిల్ల బాధలను ఈ కార్టూన్లు కళ్లకు కడుతున్నాయి.
          
ఈ ఘటనతో మానవాళి సిగ్గుపడాల్సి వస్తోందని చిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను కళ్లకు కట్టేలా ఉన్న ఈ చిత్రాలు తమతో కన్నీళ్లు పెట్టిస్తున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  తల్లి ఏనుగు, గున్న ఏనుగుకు సంబంధించిన ఈ కార్టూన్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.
              
        
              

More Telugu News