పెళ్లి చేసుకుంటానని సంబంధం పెట్టుకుంటే అత్యాచారం అనలేం: ఒడిశా హైకోర్టు కీలక రూలింగ్!
- హైకోర్టు ముందుకు వచ్చిన కేసు
- పెళ్లికి నిరాకరిస్తే రేప్ కేసు పెడుతున్నారు
- తీర్పిచ్చిన జస్టిస్ ఎస్కే పాణిగ్రాహి
కొరాపుట్ జిల్లా పొట్టంగి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో భాగంగా, ఓ యువకుడు తనతో శారీరక సంబంధం పెట్టుకుని, పెళ్లికి నిరాకరించాడని యువతి కేసు పెట్టింది. విచారణ తరువాత యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణ హైకోర్టుకు రాగా, నిందితుడికి బెయిల్ ను మంజూరు చేస్తున్నట్టుగా న్యాయమూర్తి తెలిపారు.