ముఖ్యమంత్రి జగన్ వన్ మ్యాన్ ఆర్మీ: పోసాని కృష్ణమురళి

Posani Krishna Murali Praises YS Jagan
  • జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది
  • కరోనా సమయంలోనూ ఆగని సంక్షేమం
  • కోటి రూపాయల పరిహారం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం జగన్ దే
  • సినీ నటుడు పోసాని పొగడ్తల వర్షం
అధికారంలోకి వచ్చిన ఏడాది సమయంలోనే తాను అనుకున్న అన్ని పనులనూ ఓ వన్ మ్యాన్ ఆర్మీలా వైఎస్ జగన్ పూర్తి చేశారని సినీ నటుడు పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యానించారు. తానిచ్చిన అన్ని హామీలనూ జగన్ నెరవేర్చారని, కరోనాతో కొట్లాడుతున్న సమయంలోనూ సంక్షేమ పథకాలను ఆపలేదని కొనియాడారు. తాజాగా, ఓ టీవీ చానెల్ తో మాట్లాడిన ఆయన, విశాఖ గ్యాస్ ప్రమాద బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇండియాలో మరే రాష్ట్రం కూడా, ప్రమాద బాధితులకు ఇంత భారీ పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు.

కృష్ణా పుష్కరాల సమయంలో మరణించిన వారికి చంద్రబాబునాయుడు రూ. 10 లక్షల పరిహారంతో సరిపెట్టారని, గ్యాస్ లీక్ ఘటనలో ప్రభుత్వానికి సంబంధం లేకున్నా, మృతులకు భారీ పరిహారాన్ని ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలన్నీ బాగున్నాయని, వృద్ధులు, వికలాంగులు తదితరులకు ఇళ్లకే వెళ్లి పెన్షన్ డబ్బులు నెలనెలా ఇవ్వడం దేశంలో మరెక్కడా జరగడం లేదని కొనియాడారు.
Go Back to Shorts
Posani Krishna Murali
Jagan

More Telugu News