ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ చెల్లదన్న హైకోర్టు... వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు
- కొన్నినెలల కిందట ఏబీని సస్పెండ్ చేసిన ఏపీ సర్కారు
- హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన ఏబీ
- కీలక తీర్పు వెలువరించిన హైకోర్టు
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావు గతంలో నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్టు భావించిన వైసీపీ ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంది. విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఏబీ తనపై సస్పెన్షన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ క్యాట్ కు వెళ్లగా, అక్కడ ఆయనకు నిరాశ తప్పలేదు. ఏపీ సర్కారు విధించిన సస్పెన్షన్ నిర్ణయాన్ని క్యాట్ కూడా సమర్థించింది.