Telangana: తెలంగాణలో మాంసం దుకాణదారులకు కొత్త రూల్స్.. పాటించకపోతే కఠిన చర్యలు!

  • చెత్త బుట్టలకు రంధ్రాలు ఉండరాదు
  • కత్తులను వేడి నీటితో కడగాలి
  • దుకాణాల్లో పని చేసే వారికి చర్మ వ్యాధులు ఉండరాదు
Telangana sets rules for meat shops

తెలంగాణలో కంటైన్మెంట్ ఏరియాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో షాపులు నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి. నాన్ వెజ్ షాపులను కూడా అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో, నాన్ వెజ్ అమ్మే దుకాణదారులకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. నిబంధనలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇక ప్రభుత్వం విధించిన నిబంధనలు ఏమిటంటే...

  • అన్ని దుకాణాల్లో చెత్త బుట్టలు ఉండాలి.
  • చెత్త వేసే బిన్ లకు రంధ్రాలు ఉండరాదు.
  • మాంసాన్ని కోసే కత్తులను వేడి నీటితో కడగాలి.
  • షాపుల్లో పని చేసే వారు ఆప్రాన్, గ్లౌజులు, హెడ్ గేర్ ధరించాలి.
  • దుకాణాల్లో పని చేసే వారికి చర్మ వ్యాధులు ఉండరాదు.
  • గోర్లు పెంచుకోరాదు.
  • దుకాణాలను ఎప్పటికప్పుడు బ్లీచింగ్ తో శుభ్రపరచాలి.
  • మాంసం మీద ఈగలు వాలకుండా చూసుకోవాలి.
  • వ్యర్థాలను బయట పడేయరాదు. టన్ను కంటే తక్కువ ఉంటే భూమిలో పూడ్చిపెట్టాలి. అంతకంటే ఎక్కువ ఉంటే బయో మేథనేషన్ ద్వారా నిర్మూలించాలి.

More Telugu News