Manasa radhakrishnan: పుకారు తెచ్చిపెట్టిన అదృష్టం అంటే ఇదేనేమో!

  • పవన్ తో హరీశ్ శంకర్ సినిమా
  • తెరపైకి మానస రాధాకృష్ణన్ పేరు
  • తెలుగు నుంచి వెళుతున్న అవకాశాలు
Manasara Radhakrishnan

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులతో ఆయన బిజీగా వున్నాడు. ఈ సినిమాలో కథానాయికాగా మానస రాధాకృష్ణన్ నటించనున్నట్టు వార్తలు వచ్చాయి.  మలయాళ చిత్రపరిశ్రమకి బాలనటిగా పరిచయమైన ఈ అమ్మాయి, టీనేజ్ లోకి  అడుగుపెట్టిన తరువాత అక్కడ 10 సినిమాల వరకూ చేసింది.

అలాంటి ఈ అమ్మాయి పవన్ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా పరిచయం కానున్నట్టు ప్రచారం జరిగింది. ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని హరీశ్ శంకర్ స్పష్టం చేశాడు. అయితే ఈ లోగానే మానస రాధాకృష్ణన్ గురించి యూత్ సెర్చ్ చేసేసింది. కొంతమంది దర్శక నిర్మాతలు కూడా ఆ అమ్మాయిని గురించి తెలుసుకున్నారు.

యువ కథానాయకులతో తాము నిర్మించే సినిమాల్లో కథానాయిక పాత్రల ద్వారా ఈ అమ్మాయిని పరిచయం చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారట. అలా ఈ అమ్మాయికి వరుస అవకాశాలు వెళుతున్నాయని అంటున్నారు. పుకారు తెచ్చిపెట్టిన అదృష్టం ఈ సుందరిని ఇక్కడ బిజీ చేస్తుందేమో చూడాలి.

More Telugu News