దూసుకొస్తున్న 'యాంపిన్'... ఆంధ్రప్రదేశ్ ముందు భారీ తుపాన్ గండం!
- దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం
- వాయుగుండంగా మారి మరింత బలోపేతం
- కోస్తాంధ్రలో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరిక
ఇప్పటికే ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా, దీనికి యాంపిన్ తోడు కానుందని 16 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. 17వ తేదీన తీరం వెంబడి 80 కిలోమీటర్ల వరకూ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, 18న గాలుల తీవ్రత అధికమవుతుందని హెచ్చరించారు. కాగా, నేడు రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.