జాతీయ సగటును మించిన ఏపీ కరోనా రికవరీ రేటు!
- రికవరీల్లో ఏపీ మెరుగైన గణాంకాలు
- 53.44 శాతానికి పెరిగిన రికవరీ రేటు
- అత్యద్భుత ఫలితాలు సాధించిన ప్రకాశం జిల్లా
ఇక రికవరీల్లో ప్రకాశం జిల్లా అత్యద్భుత ఫలితాలను సాధించింది. ఏకంగా 95.23 శాతం రికవరీ రేటును నమోదు చేసింది. ఈ జిల్లాలో 63 కేసులు రాగా, అరవై మంది ఇప్పటికే కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు. కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సైతం యాక్టివ్ గా ఉన్న కేసుల కన్నా, డిశ్చార్జ్ అయినవారే అధికమని అధికారులు వెల్లడించారు.