Keerthi Suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం   

  • అదేం కాదంటున్న కీర్తి సురేశ్!
  • మామయ్య సినిమాలో సాయితేజ్ 
  • 'బుట్టబొమ్మ'కు సిమ్రన్ స్టెప్పులు   
Keerthi Suresh says she is not interested in exposing

 *  త్వరలో కీర్తి సురేశ్ గ్లామర్ పాత్రలలో అందాలు ఆరబోయడానికి రెడీ అవుతోందనీ, అందుకే ఇటీవల డైటింగ్ చేసి బరువు తగ్గిందనీ వస్తున్న వార్తలను ఆ ముద్దుగుమ్మ ఖండించింది. 'నేను బరువు తగ్గింది కాస్త నాజూగ్గా కనపడడానికే తప్ప, ఎక్స్ పోజింగ్ పాత్రల్లో నటించడానికి కాదు.. ఆ ప్రచారాన్ని ఎంతమాత్రం నమ్మకండి' అంటూ పేర్కొంది.  
*  మలయాళంలో హిట్టయిన 'డ్రైవింగ్ లైసెన్స్' చిత్రాన్ని పవన్ కల్యాణ్ హీరోగా తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఇందులో మరో యంగ్ హీరో పాత్ర కూడా వుంటుంది. ఆ పాత్రలో పవన్ మేనల్లుడు సాయితేజ్ నటిస్తాడని ప్రచారం జరుగుతోంది.  
*  'అల వైకుంఠపురములో' చిత్రంలోని బుట్టబొమ్మ పాట ఎంతోమందిని అలరించింది. దాంతో పలువురు దీనికి స్టెప్పులేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతున్నారు. తాజాగా నిన్నటితరం హీరోయిన్ సిమ్రన్ కూడా ఈ పాటకు ఇన్స్ పైర్ అయింది. దాంతో ఆ పాటకు స్టెప్పు లేసింది. ఆ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.  

More Telugu News